సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీస్ లో కథానాయిక ప్రాధాన్యం గురించి రష్మిక మాట్లాడుతూ ఇది వరకటి విషయం వేరేకానీ, ఇప్పుడు హీరోయిన్లను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదనీ , వాళ్ళ పాత్రని తీర్చిదిద్దడంలో ఏమాత్రం అలసత్వం చూపించినా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తోందనీ , కథలో ప్రతీ పాత్రా కీలకమేననీ , అందుకే దర్శకులు, రచయితలు కథానాయికలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారనీ , కేవలం పారితోషికాల గురించి ఆలోచించి సినిమాల్ని ఒప్పుకునే రోజులు పోయాయనీ , పాత్ర నచ్చితేనే ఏదైనా అనీ , తమకెలాంటి ప్రాధాన్యం లేకపోతే ఆ సినిమాలో నటించడానికి హీరోయిన్లు ముందుకు రావడం లేదనీ , ఓ రకంగా ఇది మంచి పరిణామం అనీ రష్మిక చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: