క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమాల కోసం ఆనంద్ ఎంతో తపనగా హార్డ్ వర్క్ చేస్తూ తన సోదరుడి సలహాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా “పుష్పక విమానం” మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ మరో మూవీ తో అలరించనున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ , వైష్ణవిచైతన్య ప్రధాన పాత్రలలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న “బేబి”మూవీ దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఆనంద్ నటిస్తున్న “బేబి”మూవీకి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతీ యువకులు కాలేజ్ స్టూడెంట్స్ రోల్స్ కోసం కాస్టింగ్ కాల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. యువ ప్రతిభావంతులైన నటీనటులకు అవకాశం కల్పించేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్నవారు వారి ఫొటోలను పంపాలని కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: