
ట్యాగ్ · 76 కథనాలు · పేజీ 3


'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్

'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్

'ఆకాశవాణి' ట్రైలర్ రిలీజ్

"మరో ప్రస్థానం" ట్రైలర్ రిలీజ్

“గూడుపుఠాణి” మూవీ ట్రైలర్ రిలీజ్

రెజీనా 'నేనే నా' ట్రైలర్ రిలీజ్

"గల్లీ రౌడీ" ట్రైలర్ రిలీజ్ చేసిన "స్టేట్ రౌడీ"

'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్

"ఫ్రెండ్ షిప్ "మూవీ ట్రైలర్ రిలీజ్

'లాభం' ట్రైలర్ రిలీజ్

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

'సీటీమార్' ట్రైలర్ రిలీజ్

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్

'101 జిల్లాల అందగాడు' ట్రైలర్ రిలీజ్

'మాస్ట్రో' ట్రైలర్ రిలీజ్

'హౌస్ అరెస్ట్' ట్రైలర్ రిలీజ్

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్ రిలీజ్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేయగా ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్ ఎంట్రీ.. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను…

'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్
సాయి తేజ్ హీరోగా దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ…

'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

'ఆకాశవాణి' ట్రైలర్ రిలీజ్
అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రాజమౌళి దగ్గర పలు సినిమాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ మాత్రం చాలా లేట్ అయింది. ఇక ఇటీవలే ఆసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అడవిలో జీవనం సాగించే వాళ్లు ఎలా ఉంటారో.. వాళ్లపై అక్కడ…

"మరో ప్రస్థానం" ట్రైలర్ రిలీజ్
మిర్త్ మీడియా బ్యానర్ పై జానీ దర్శకత్వంలో తనీష్ , ముస్కాన్ సేథీ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "మరో ప్రస్థానం"మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భానుశ్రీ మెహ్రా , కబీర్ దుహాన్ సింగ్ , రవి కాలె , అమిత్ తివారీ ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. షేక్ జానీ భాషా నిర్మాత.

“గూడుపుఠాణి” మూవీ ట్రైలర్ రిలీజ్
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మాతలుగా కె.ఎమ్. కుమార్ దర్శకత్వంలో సప్తగిరి , “90 ML “మూవీ ఫేమ్ నేహా సోలంకి జంటగా కామెడీ ఎంటర్ టైనర్ “గూడుపుఠాణి “మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు రఘు కుంచె విలన్ గా నటించారు. ప్రతాప్ విద్య సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రెజీనా 'నేనే నా' ట్రైలర్ రిలీజ్
‘ఎస్. ఎం. ఎస్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రెజీనా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ రేటు కాస్త తక్కువగా ఉన్నా కూడా రెజీనా కు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈమధ్య 'ఎవరు' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కూడా చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మాత్రం తన ధోరణిని మార్చేసి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితంకాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతుంది.

"గల్లీ రౌడీ" ట్రైలర్ రిలీజ్ చేసిన "స్టేట్ రౌడీ"
స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “గల్లీ రౌడీ ” మూవీ 17 వ తేదీ రిలీజ్ కానుంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ లో బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ మరీ ముఖ్యంగా సారంగదరియా పాట కానీ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. దీంతో ఈసినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అందుకే అభిమానులు కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసినిమా రిలీజ్ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే కదా. మొదట ఈ ఏడాది ఏప్రిల్ లో అనుకున్నారు కానీ రిలీజ్ అవ్వలేదు.. ఆ తరువాత కొన్ని రోజులు ఓటీటీ లో రిలీజ్ అవుతుందని కన్ఫ్యూజన్లో పెట్టారు. ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మొదట వినాయక చవితికి వస్తుందని…

"ఫ్రెండ్ షిప్ "మూవీ ట్రైలర్ రిలీజ్
సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ , లోస్లియా మరియ నేసన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫ్రెండ్ షిప్ "మూవీ తెరకెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటించారు. డి ఎమ్ ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. అర్జున్ , హర్భజన్ ఇద్దరి యాక్షన్ సీన్స్ "ఫ్రెండ్ షిప్ "మూవీకి హైలైట్ కానున్నాయి.

'లాభం' ట్రైలర్ రిలీజ్
టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

'సీటీమార్' ట్రైలర్ రిలీజ్
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈసినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్టర్లు, విడుదల అయిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్
వైవిద్యమైన సినిమాలతో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అనబెల్ అండ్ సేతుపతి.కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

'101 జిల్లాల అందగాడు' ట్రైలర్ రిలీజ్
నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 101 జిల్లాల అందగాడు. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గానే ఈసినిమాను తెరకెక్కిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ నెల 27న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉండటంతో సెప్టెంబర్ 3న విడుదల తేదీని నిర్ణయించారు.

'మాస్ట్రో' ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు మూడో సినిమాతో రెడీగా ఉన్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంధధూన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న మూవీ మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉండంగా రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 10న డిస్నీ హాట్‌స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'హౌస్ అరెస్ట్' ట్రైలర్ రిలీజ్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘హౌజ్ అరెస్ట్’. 90 ఎమ్ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి యర్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్ రిలీజ్
సరైన హిట్ కోసం ఎదురుచూసే హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అప్పుడెప్పుడో చి.ల.సౌ సినిమాతో ఒక మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నా ఆ తరువాత మరో సినిమా చేయలేదు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో రాబోతున్నాడు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.