వైవిద్యమైన సినిమాలతో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అనబెల్ అండ్ సేతుపతి.కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కూడా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు కూడా. దీనిలో భాగంగా ఈరోజు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ ను రిలీజ్ చేశారు.
Happy to be launching #AnnabelleSethupathi Telugu trailer. Get ready to watch it streaming in Tamil, Telugu, Hindi, Kannada & Malayalam from Sept 17 on
@DisneyPlusHSTrailer: https://t.co/3BtZuPnnVj@vijaysethuoffl @taapsee @SDeepakDir @PassionStudios_ pic.twitter.com/EWiFJJfAOg
— Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2021
కాగా దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఇంకా రాధిక శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 17 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇక తాప్సీ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజగా ఉంది. తెలుగు, హీందీ, తమిళ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఆర్ ఎస్ జె దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో `మిషన్ ఇంపాజిబుల్` సినిమా చేస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.