స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “గల్లీ రౌడీ ” మూవీ 17 వ తేదీ రిలీజ్ కానుంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ లో బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆదివారం సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాడు రౌడీ, వాళ్ళ నాన్న రౌడీ, వాళ్ళ తాత రౌడీ అంటూ హీరో గురించి హీరోయిన్ నేహా శెట్టి బిల్డప్ ఇవ్వడం, విలన్లను సందీప్ కిషన్ చితక్కొట్టడం, సందీప్ రౌడీ అనే అంశం చుట్టూ రూపొందించిన వినోదమైన సన్నివేశాలు ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. పక్కా వినోదాత్మక చిత్రమిదనీ , ఈ నెల 17న థియేటర్లలో మేము నవ్వులతో దాడి చేయబోతున్నామనీ , ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్‌కు థాంక్స్ అనీ చిత్రబృందం తెలిపింది.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: