నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 101 జిల్లాల అందగాడు. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గానే ఈసినిమాను తెరకెక్కిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ నెల 27న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉండటంతో సెప్టెంబర్ 3న విడుదల తేదీని నిర్ణయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ అలాగే మనసా వినవా సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక నేడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
Very happy to launch the trailer of #101JillalaAndagadu.
I had the pleasure of working with @YRajeevReddy1 ,@DirKrish & #SrinivasAvasarala before & I’m sure this one is a laugh riot!👍▶️ https://t.co/xq8mJjUinb@iRuhaniSharma #SagarRachakonda @shakthikanth @SVC_official
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 25, 2021
కాగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సరసన రుహనీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: