అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రాజమౌళి దగ్గర పలు సినిమాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ మాత్రం చాలా లేట్ అయింది. ఇక ఇటీవలే ఆసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అడవిలో జీవనం సాగించే వాళ్లు ఎలా ఉంటారో.. వాళ్లపై అక్కడ దొర చేసే అరాచకాలు.. దాడుల గురించి ఈసినిమా ఉంటుందని అర్థమవుతుంది.ట్రైలర్‌లోని లోకేషన్లు, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Prabhas Sir 😘❤️ Thank you so much for this.#Aakashavaani Trailer Out Now https://t.co/rZwRfRMVKE
Hope you all like it. Please do share and spread the word 🙂#AakashavaaniFromSep24th #AakashavaaniOnSonyLIV pic.twitter.com/OPLlw8cWXI
— Ashwin Gangaraju (@AshwinGangaraju) September 20, 2021
కాగా ఇంకా ఈసినిమాలో వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు. కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఎడిటర్‌గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: