ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 49
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

మన్మథుడు 2 సెకండ్ టీజర్ విడుదల

స్పీడ్ పెంచకపోతే కష్టం మాష్టార్లు

జూలై లో దర్శకుడు విజయ్ మ్యారేజ్

`ఎన్జీకే` రిలీజ్ డేట్ మారిందా?

అప్పుడు కార్తితో... ఇప్పుడు సూర్యతో...

మరో రీమేక్‌లో కియరా అద్వాని?

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్

`దేవ్` రన్ టైమ్ అప్‌డేట్

సాయిపల్లవిని బీట్ చేసిన సాయిపల్లవి

కోన సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

విజయ్ దేవరకొండతో హుషారు డైరెక్టర్ మూవీ!

బాలకృష్ణకి జోడీగా నాని హీరోయిన్?

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్

మరోసారి తమిళ దర్శకుడితో విజయ్ దేవరకొండ?

రెండో ‘మన్మథుడు’కి జోడీగా ఇద్దరు భామలు?

సమంత చిత్రంలో అతిథిగా నాగ్?
సూపర్ కంటెంట్ తో వస్తున్న 'అశ్వమేథం'
'అశ్వమేథం'.. ఈ మాట మనం మన పురాణాలలో చాలాసార్లు వినే ఉంటాం. ఒక దైవికమైన అశ్వాన్ని (గుర్రాన్ని) బలిదానమివ్వడమే దాని అర్ధం. ఇది అప్పట్లో రాజులు తమ దేశ ప్రజలకు శాంతిని, సుభిక్షాన్ని కలిగించేందుకు చేస్తారు. ఇక సుభిక్షత ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. శ్రీరాముడు బంగారు సీతమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని అశ్వమేథ యాగం చేస్తాడు...ఇలమహారాజు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఈ యాగం చేసినట్టు విన్నాం. అంటే ఎన్నో విధి విధానాలకు నిష్టగా కట్టుబడి ఉండి.. చేసే పని అని ఇప్పటి వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పొచ్చేమో. ఇప్పుడు ఈ 'అశ్వమేథ యాగం' గురించి ఇంత ఉపోద్ఘాతం…
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు ఇటీవల వచ్చిన టీజర్ కు పాటలకు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మన్మథుడు 2 సెకండ్ టీజర్ విడుదల
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మన్మథుడు 2 మూవీ ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ అతిథి పాత్రలలో నటించారు. రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, దేవ దర్శిణి ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

మూడు ఆసక్తికరమైన చిత్రాలతో బాలీవుడ్‌లోకి దిల్ రాజు?
‘దిల్’ రాజు... తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత. నిర్మాతగా గత 16 ఏళ్ళుగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్... ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజు. అంతేకాదు... ఈ మూడూ కూడా తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం.

స్పీడ్ పెంచకపోతే కష్టం మాష్టార్లు
పాతం తరంలో ఎంత మంది హీరోలు ఉన్నా వెంటనే గుర్తొచ్చే స్టార్ హీరోలు మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ రాజు వీళ్లే.. ఆ తరువాత తరంలో కూడా ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు... కానీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జుననే అగ్ర హీరోలుగా నిలిచారు. వారి తరువాత జనరేషన్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నితిన్, శర్వానంద్, రానా, నిఖిల్, సందీప్ కిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.

జూలై లో దర్శకుడు విజయ్ మ్యారేజ్
సూపర్ హిట్ కిరీడం మూవీ తో కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన AL విజయ్ దర్శకత్వంలో రూపొందిన మదరాసిపట్టినం, దైవ తిరుమగళ్, తాండవం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అభినేత్రి, కణం, అభినేత్రి 2 మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. AL విజయ్ ప్రస్తుతం తమిళ నాడు దివంగత CM జయలలిత బయోపిక్ మూవీ తలైవి ని కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందిస్తున్నారు. 2014 సంవత్సరంలో హీరోయిన్ అమలాపాల్ ను వివాహం చేసుకున్నారు. 2017 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

`ఎన్జీకే` రిలీజ్ డేట్ మారిందా?
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఎన్జీకే`. సూర్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్... ఇటీవలే విడుదలై ఆసక్తిని రేకెత్తించింది.

అప్పుడు కార్తితో... ఇప్పుడు సూర్యతో...
గోపీచంద్ హీరోగా నటించిన `శౌర్యం` (2008) చిత్రంతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ శివ... ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్. ముఖ్యంగా అజిత్ కాంబినేషన్‌లో శివ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. `వీరం`, `వేదాళం`, `వివేగమ్`, `విశ్వాసం`... ఇలా అజిత్, శివ కాంబినేషన్ కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతికి వచ్చిన `విశ్వాసం` వారిద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలచింది. ఈ నేపథ్యంలో... `విశ్వాసం` తరువాత శివ తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ స్టార్ విజయ్‌తో శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న వార్తలు…

మరో రీమేక్‌లో కియరా అద్వాని?
`భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియరా అద్వాని. మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి విజయాన్ని నమోదు చేసుకున్న కియరా... ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`తోనూ అలరించింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉంది కియరా. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న `గుడ్ న్యూస్`లో ఓ కథానాయికగానూ... అలాగే ప్రతిష్ఠాత్మక చిత్రం `కళంక్`లో ప్రత్యేక గీతంలోనూ కనువిందు చేయనుంది. అంతేకాదు... `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఫెయిల్యూర్ పై చరణ్ స్పందిస్తూ అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని.. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ ఈ సినిమా కాలేకపోయింది. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్... ముందు ముందు మంచి సినిమాలతో వస్తామని తెలిపారు. దీంతో చరణ్ పై ప్రశంసలు కురిపించారు అందరూ.

`దేవ్` రన్ టైమ్ అప్‌డేట్
`ఖాకి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత తమిళ కథానాయకుడు కార్తి, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `దేవ్`. నూతన దర్శకుడు రజత్ రవిశంకర్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతమందించాడు. గతంలో సూర్య నటించిన పలు విజయవంతమైన చిత్రాలకు హారిస్ స్వరాలందించగా... కార్తి కాంబినేషన్‌లో హారిస్ బాణీలందించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. కాగా... అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ నెల 14న…

సాయిపల్లవిని బీట్ చేసిన సాయిపల్లవి
ఈ తరం కథానాయికల్లో సాయిపల్లవి కున్న క్రేజే వేరు. నటన, నర్తన... ఈ రెండు విషయాల్లోనూ తనకు తిరుగులేదనిపించుకుంది ఈ అమ్మడు. అంతేకాదు... ఫలితాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ అభిమానగణాన్ని సంపాదించుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా... సాయిపల్లవి డ్యాన్సులకు `ఫిదా` కాని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే... యూ ట్యూబ్‌లో సాయిపల్లవి నర్తించిన పాటలను పదే పదే వీక్షిస్తూ... ఆమె పాపులర్ సాంగ్స్ ను కాస్త మోస్ట్ వ్యూయిడ్ సాంగ్స్ గా అందలమెక్కిస్తున్నారు యూట్యూబ్ వ్యూయర్స్. తాజాగా... ఈ ముద్దుగుమ్మ తన పాట రికార్డును తనే బద్ధలు కొట్టింది.

కోన సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి అమెరికాలో ప్రారంభంకానుందని... 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని కోన వెంకట్ ఇప్పటికే తెలిపారు.

విజయ్ దేవరకొండతో హుషారు డైరెక్టర్ మూవీ!
శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో.. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం ‘హుషారు’. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేశ్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. పెద్ద సినిమాలే నాలుగైదు వారాలు మించి ఆడని తరుణంలో చిన్న సినిమా అయినా 50 రోజులు పూర్తి చేసుకొని పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు ‘హుషారు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాల్లోకి వెళ్లింది. మొదట తక్కువ థియేటర్లే దక్కినా.. తరువాత ఈ సినిమాకు వచ్చిన టాక్ వల్ల థియేటర్లు పెంచాల్సి వచ్చింది…

బాలకృష్ణకి జోడీగా నాని హీరోయిన్?
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో... `సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఓ కన్నడ భామకు దక్కిందని సమాచారం. కన్నడ బ్లాక్‌బస్టర్ `యూ టర్న్`తో దక్షిణాదిన పాపులర్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ కి ఈ భారీ బడ్జెట్ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కిందని సమాచారం.

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్
స్టార్ డైరెక్టర్ సుకుమార్ అటు సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య. సుకుమార్ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్ ఖరారైంది.

ఈ ఏడాదిలోనూ ‘దిల్’ రాజు నుంచి ఆరు చిత్రాలు?
ఈ తరం నిర్మాతలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే... నిస్సంకోచంగా `దిల్` రాజు అనే చెప్పాలి. ముఖ్యంగా... 2017లో అయితే ఆరు సినిమాలను నిర్మించడమే కాకుండా వరుస విజయాలతో `డబుల్ హ్యాట్రిక్` కొట్టి నయా రికార్డు సృష్టించారు. అయితే... 2018లో మాత్రం ఆ మ్యాజిక్‌ని కంటిన్యూ చేయలేకపోయారు రాజు. కాగా... తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్... ఈ సంవత్సరం కూడా 2017లో తరహాలోనే ఆరు చిత్రాలతో పలకరించే దిశగా అడుగులు వేస్తున్నారని టాలీవుడ్ టాక్.

మరోసారి తమిళ దర్శకుడితో విజయ్ దేవరకొండ?
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... ఈ యూత్ ఐకాన్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అదయ్యే లోపే... క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ బ్యానర్‌లో క్రాంతి మాధవ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించడంతో... విజయ్ నటించబోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... `నోటా` తరువాత మరో తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రెండో ‘మన్మథుడు’కి జోడీగా ఇద్దరు భామలు?
కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మన్మథుడు’ (2002) ఒకటి. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... టాలీవుడ్ మన్మథుడుగా నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కాగా... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రూపుదిద్దుకోబోతోంది. ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

సమంత చిత్రంలో అతిథిగా నాగ్?
కింగ్ నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత వెండి తెరపై కనిపిస్తే అక్కినేని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు. ఇప్పటివరకు ఈ మామా కోడళ్లు ‘మనం’, ‘రాజు గారి గది 2’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. కాగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెరను పంచుకోవడానికి వీరిద్దరూ సిద్ధపడుతున్నట్లు టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి.