మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఫెయిల్యూర్ పై చరణ్ స్పందిస్తూ అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని.. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ ఈ సినిమా కాలేకపోయింది. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్… ముందు ముందు మంచి సినిమాలతో వస్తామని తెలిపారు. దీంతో చరణ్ పై ప్రశంసలు కురిపించారు అందరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా చరణ్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటం వల్ల బయ్యర్లు పెద్ద మొత్తంలోనే సినిమాలు కొనుగోలు చేశారు. ధియేట్రికల్ రైట్స్ 90 కోట్లకి అమ్ముడుపోయాయి. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల వరకు కలెక్ట్ చేసినా.. బయ్యర్లకి 30 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా నష్టాలని తగ్గించి బయ్యర్లకి కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేస్తున్నారు చరణ్, నిర్మాత దానయ్య. ఇద్దరూ కలిసి ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత… రూ. 15 కోట్ల మేర పరిహారం చెల్లించాలని డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగానే రామ్ చరణ్ తన 5 కోట్ల రెమ్యునరేషన్ ను వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి రెడీ అయ్యాడు. మిగిలిన 10 కోట్లు దానయ్య ఒక్కరే భరిస్తారా? లేక బోయపాటిని కూడా కొంత రిటర్న్ ఇవ్వాలని అడుగుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో దర్శక, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్.
ఏది ఏమైనా సినిమా నష్టాలలో బాద్యత తీసుకొని 5 కోట్లు రెమ్యునరేషన్ తిరిగి రిటర్న్ ఇచ్చేడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీ కావడం నిజంగా గొప్ప విషయం అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది. మరి నిజంగానే బయ్యర్లను ఆదుకొని మరోసారి చరణ్ జెంటిల్ మ్యాన్ అయ్యాడు.
[youtube_video videoid=CG2prtM2O70]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: