నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో… `సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఓ కన్నడ భామకు దక్కిందని సమాచారం. కన్నడ బ్లాక్‌బస్టర్ `యూ టర్న్`తో దక్షిణాదిన పాపులర్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ కి ఈ భారీ బడ్జెట్ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`సింహా`, `లెజెండ్` తరహాలోనే ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించనుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి జోడీగా `జెర్సీ`లో నటిస్తున్న శ్రద్ధాకి… రెండో తెలుగు చిత్రంతోనే బాలయ్య వంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ దక్కడం అపురూపమైన అవకాశమే. ఎన్.బి.కె. ఫిల్మ్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: