కింగ్ నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత వెండి తెరపై కనిపిస్తే అక్కినేని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు. ఇప్పటివరకు ఈ మామా కోడళ్లు ‘మనం’, ‘రాజు గారి గది 2’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. కాగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెరను పంచుకోవడానికి వీరిద్దరూ సిద్ధపడుతున్నట్లు టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సమంత ప్రధాన పాత్రధారిణిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బేబీ’(ప్రచారంలో ఉన్న పేరు)లో నాగార్జున ఓ అతిథి పాత్రలో మెరవనున్నారట. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో… నాగ్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారనీ, దానికి సంబంధించి ఇప్పటికే ట్రయిల్ షూట్ కూడా పూర్తైందనీ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: