`ఖాకి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత తమిళ కథానాయకుడు కార్తి, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `దేవ్`. నూతన దర్శకుడు రజత్ రవిశంకర్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతమందించాడు. గతంలో సూర్య నటించిన పలు విజయవంతమైన చిత్రాలకు హారిస్ స్వరాలందించగా… కార్తి కాంబినేషన్‌లో హారిస్ బాణీలందించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. కాగా… అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ నెల 14న తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `క్లీన్ యు` సర్టిఫికేట్ జారీ చేసింది. అంతేకాదు… ఈ సినిమా రన్ టైమ్ 158 (2 గంటల 38 నిమిషాలు) ఉంటుందని తెలిసింది. మరి… `ఖాకి` తరువాత మరోసారి జోడీకట్టిన కార్తి, రకుల్ జంట మరోసారి మెప్పిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=yhH3S6PdY7U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: