‘దిల్’ రాజు… తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత. నిర్మాతగా గత 16 ఏళ్ళుగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్… ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజు. అంతేకాదు… ఈ మూడూ కూడా తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తన నిర్మాణంలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న ‘ఎఫ్ 2’ను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలసి నిర్మించనున్నారు రాజు. హిందీలో పలు కామెడీ ఎంటర్ టైనర్స్‌ను తెరకెక్కించిన అనీస్ బాజ్‌మీ ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌నూ రూపొందిస్తున్నాడు. అంతేకాకుండా… నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ని కూడా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌తో కలసి నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు… రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా నటించిన ‘ఎవడు’ చిత్రాన్ని కూడా హిందీలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిఖిల్ అద్వానీతో కలసి నిర్మిస్తుండగా… మిలాప్ ఝవేరి దర్శకత్వం వహించనున్నట్టు బాలీవుడ్ ఖబర్.
మొత్తమ్మీద ఈ మూడు ఇంటరెస్టింగ్ మూవీస్‌ను బాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తుండడం… బాలీవుడ్‌లోనూ నిర్మాతగా ‘దిల్’ రాజుకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. కాగా… మూడు డిఫరెంట్ జానర్లతో తెరకెక్కబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=LJO52K_4JDA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: