ఈ తరం కథానాయికల్లో సాయిపల్లవి కున్న క్రేజే వేరు. నటన, నర్తన… ఈ రెండు విషయాల్లోనూ తనకు తిరుగులేదనిపించుకుంది ఈ అమ్మడు. అంతేకాదు… ఫలితాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ అభిమానగణాన్ని సంపాదించుకుందీ టాలెంటెడ్ బ్యూటీ. ముఖ్యంగా… సాయిపల్లవి డ్యాన్సులకు `ఫిదా` కాని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే… యూ ట్యూబ్‌లో సాయిపల్లవి నర్తించిన పాటలను పదే పదే వీక్షిస్తూ… ఆమె పాపులర్ సాంగ్స్ ను కాస్త మోస్ట్ వ్యూయిడ్ సాంగ్స్ గా అందలమెక్కిస్తున్నారు యూట్యూబ్ వ్యూయర్స్. తాజాగా… ఈ ముద్దుగుమ్మ తన పాట రికార్డును తనే బద్ధలు కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… దక్షిణాది పాటల్లో యూ ట్యూబ్‌లో నిన్నటి వరకు సాయిపల్లవి నర్తించిన `ఫిదా`లోని `వచ్చిండే` పాటకు అత్యధిక వ్యూస్ ఉన్నాయి. అయితే… తాజాగా ఆ పాటను `మారి 2`లోని `రౌడీ బేబి` (తమిళ వెర్షన్) పాట బీట్ చేసింది. సెప్టెంబర్ 23, 2017న యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన `వచ్చిండే` పాట ఇప్పటివరకు 182,270,453 వ్యూస్ రాబట్టుకుంటే… జనవరి 2, 2019న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన `రౌడీ బేబి` పాట కేవలం 38 రోజుల్లోనే 182,958,879 వ్యూస్ రాబట్టుకుంది. ఈ రెండు పాటల్లోనూ సాయిపల్లవి నృత్యాలు ప్రధాన ఆకర్షణ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తమ్మీద… సాయిపల్లవి రికార్డును సాయిపల్లవే బీట్ చేసిందన్నమాట.
[youtube_video videoid=bCITH3-eaRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: