భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు ఇటీవల వచ్చిన టీజర్ కు పాటలకు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్ సినిమా, మైత్రీ మూవీమేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జులై 26న రిలీజ్ కానుంది. మరి గీతాగోవిందం హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..
[youtube_video videoid=n3AqEHg6ofI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: