స్పీడ్ పెంచకపోతే కష్టం మాష్టార్లు

Tollywood Actors Need to Speed Up Their Movies,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Actors Latest News,South Actors Upcoming Movie News,Telugu Actors Next Film Updates,Tollywood Actors Next Films Update List
Tollywood Actors Need to Speed Up Their Movies

పాతం తరంలో ఎంత మంది హీరోలు ఉన్నా వెంటనే గుర్తొచ్చే స్టార్ హీరోలు మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ రాజు వీళ్లే.. ఆ తరువాత తరంలో కూడా ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు… కానీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జుననే అగ్ర హీరోలుగా నిలిచారు. వారి తరువాత జనరేషన్ కు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నితిన్, శర్వానంద్, రానా, నిఖిల్, సందీప్ కిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానికి కారణం మారుతున్న రోజులు… ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే అదో అద్భుతంలా ఉండేది.. కానీ ఇప్పుడు ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు థియేటర్లల్లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. కాదు కాదు కొట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. మరి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మన హీరోలు ఇంకెంత ఫాస్ట్ గా ఉండాలి. అభిమానులు ఉన్నారులే.. మనం సినిమా ఎప్పుడు చేసినా చూస్తారు అన్న ధోరణిలో ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

ఒకప్పుడు హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలపైనే చేసేవాళ్లు.. కృష్ణ అయితే అప్పట్లో ఒక్క ఏడాదే 15 సినిమాల పైన చేశాడంటే ఎంత కష్టపడే వాళ్లో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా తీయడానికే నానా కష్టాలు పడుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ రంగస్థలం, అరవింద సమేత సినిమాల తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ అయిపోయారు. రంగస్థలం సినిమా తరువాత రామ్ చరణ్ దాదాపు ఏడాది పైన అయినా కొత్త సినిమా రాలేదు. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా గత ఏడాది అక్టోబర్ లో వచ్చింది. తను కూడా మరే సినిమాకూ కమిట్ అవ్వలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఏమో 2020 జులైలో రిలీజ్ అవ్వనుంది. అల్లు అర్జున్ కూడా ఇదే బడి. నా పేరు సూర్య సినిమా తరువాత ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ప్రభాస్ అయితే బాహుబలి సినిమా రిలీజ్ అయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకూ చేయలేదు. 2017 నుండి సాహో సినిమాతోనే బిజీ అయిపోయాడు. ఫైనల్లీ ఆగష్ట్ 15న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. రానా కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత ఇప్పటి వరకూ హీరో గా ఏ సినిమాను పట్టాలెక్కించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించినా అది కొంత సేపు మాత్రమే ఉంటుంది. నిఖిల్, శర్వా, సందీప్ కిషన్ ఈ యంగ్ హీరోలు కూడా అంతే సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు.

కానీ అప్పుడు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో అంటే ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి నడిచిపోయింది. తక్కువ హీరోలు కాబట్టి దర్శక నిర్మాతలు వారి కోసం వేచి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు రోజుకో హీరో సినీ ఇండస్ట్రీలో ల్యాండ్ అవుతుంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొత్త వాళ్లతో సినిమాలు తీసేస్తున్నారు. ఇక ఆడియన్స్ కూడా మారారు కాబట్టి.. కంటెంట్ ఉంటే చాలు సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేసేస్తున్నారు. రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీలను చేసేస్తున్నారు. అలా హిట్ కొట్టి ప్రస్తుతం బిజీ బిజీ అవుతున్న యంగ్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్, సుధీర్ బాబు, విజయ్ దేవరకొండ, హీరో కమ్ రైటర్ అయిన అడివి శేషు, ఎక్స్ 100 హీరో కార్తికేయ, ఫలుక్ నామా దాస్ హీరో విశ్వక్ సేన్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఫామ్ లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి, మల్లేశం లాంటి సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను చూపించిన ప్రియదర్శి, బ్రోచే వారెవరురా సినిమాతో హిట్ కొట్టిన శ్రీ విష్ణు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాందించుకుంటున్నారు.

మరి స్టార్ హీరోలు ఇప్పుడైనా కాస్త అలర్ట్ అయి సినిమాలు చేస్తేనే బెటర్. సినిమా సినిమాకు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంటే కష్టం.. ఈ గ్యాప్ లో యంగ్ హీరోలు దూసుకుపోతూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తారు. అందుకే కాస్త స్పీడ్ పెంచితే బెటర్.. లేకపోతే గడ్డు కాలం ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

[youtube_video videoid=KqwatWYFI7o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =