దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో యశ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించడంతో హీరో యశ్ ఆల్ ఇండియా క్రేజీ హీరోగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో యశ్ ప్రస్తుతం “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీలో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ ని తెరకెక్కిస్తున్నారు. “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ , యశ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించనున్నారనీ, హీరో యశ్ తో చర్చలు జరుపుతున్నారనీ సమాచారం. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ పూరి జగన్నాథ్ , క్రేజీ హీరో యశ్ కాంబినేషన్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: