షూటింగ్స్ తో తాప్సీ బిజీ

Actress Taapsee Pannu Gets Busy With Back To Back Movie Shooting Schedules

తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ “ఛష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్ లో బిజీగా మారారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ , హిందీ భాషల పలు మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మూవీ షూటింగ్స్ 6నెలల తరువాత ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ తాప్సీ వరస మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తాప్సీ రీసెంట్ గా “అన్నాబెల్లె” తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు . ఈ నేపథ్యంలో తాప్సీ మాట్లాడుతూ .. ఎక్కడో ఒక చోట , ఎప్పుడో ఒకప్పుడు పని చేయడం తప్పదు కదా అనుకుంటూ సెట్స్ కు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలనీ , మంచి ఆహారపు అలవాట్లు , పరిశుభ్రత విషయం లో జాగ్రత్త వహించడం ముఖ్యమనీ , తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా జాగ్రత్తలతో “అన్నాబెల్లె” తమిళ మూవీ చిత్రీకరణ పూర్తి అయిందనీ, ఈ నెల లోనే “హసీనా దిల్ రుబా ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి “రష్మీ రాకెట్ “, “లూప్ లపేటా ” మూవీస్ షూటింగ్ లో పాల్గొనాలని తాప్సీ చెప్పారు. “జనగణమణ “(తమిళ ), “శభాష్ మిథు “(హిందీ ) మూవీస్ కు తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.