‘ముత్తయ్య మురళీధరన్ ‘ బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

Vijay Sethupathi walks out of muthaiah muralidharan Biopic

మొత్తానికి విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. అంతే కాదు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ సేతుపతిని చూసి అచ్ఛం అలానే ఉన్నాడన్న ప్రశంసలు కూడా దక్కాయి. అయితే మరోపక్క ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్లో నటించవద్దంటూ నిరసనలు కూడా వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీలంక మతవాదనకు మద్దతు పలికిన మురళీధరన్‌ నమ్మకద్రోహి అని కాబట్టి అతని బయోపిక్‌లో నటించవద్దంటూ పలు తమిళ సంఘాలు…భారతీరాజాతో సహా పలువురు కోలీవుడ్ ప్రముఖులు కోరారు. దీనితో ఫైనల్ గా విజయ్ ఈ బయోపిక్ నుండి తప్పుకున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన బయోపిక్ పై వస్తున్న విమర్శలపై ముత్తయ్య మురళీధరన్ ఒక స్టేట్ మెంట్ విడుదల చేశారు. “నా బయోపిక్‌ ‘800’ను అనౌన్స్‌ చేసిన తర్వాత కొందరు కొన్ని విమర్శలు చేశారు. కొందరి వ్యక్తులకు నా మీదున్న తప్పైన అవగాహనతో ‘800’ సినిమా నుండి వైదొలగమని నటుడు విజయ్‌ సేతుపతికి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నా కారణంగా తమిళనాడులోని ఓ మంచి నటుడు బాధపడకూడదని భావిస్తున్నాను. అంతే కాకుండా భవిష్యత్తులో విజయ్‌ సేతుపతికి కెరీర్‌ పరంగా ఎలాంటి సమస్యలు రాకూడదని, విజయ్‌సేతుపతిని ఈ సినిమా నుండి వైదొలగమని కోరుతున్నాను అని తెలిపాడు. ఇక దీనికి విజయ్ ఒప్పుకొని ధ‌న్య‌వాదాలు, వీడ్కోలు అని తెలుపుతూ ట్వీట్ చేశారు.

 

మరి ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు విజయ్ సేతుపతి ప్లేస్ లో ఇంకెవరిని తీసుకుంటారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 13 =