వీక్లీ రౌండప్.. డోంట్ మిస్

Check out top tollywood movie updates for the week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ రిలీజ్

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల నుండే ఆ హడావిడి మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ముందుగా చెప్పినట్టే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అదుర్స్ అనేలా ఉంది. ప్ర‌భాస్, పూజాల మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను అద్భుతంగా ఆవిష్క‌రించారు. ముందు రోమియో-జులియేట్‌, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్‌ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్‌ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. మరి చూడబోతే ఈ సినిమా కూడా ప్రేమ కావ్యంలా రూపొందించనున్నట్టు తెలుస్తుంది.

 

పూర్ణ ‘సుందరి’ ప్రీ లుక్ రిలీజ్

ప్రస్తుతం క‌ళ్యాణ్ జీ గోగ‌న దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా ‘సుందరి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంద‌మైన కాళ్ల‌కు బంగారు ప‌ట్టీల‌తో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ప్రీలుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో రిలీజ్

దాదాపు రెండేళ్ల నుండి ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు ముక్తి కలిగింది. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రామ్ చ‌ర‌ణ్ వాయిస్‌తో ప్రారంభ‌మైన వీడియోలో.. వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి, నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయి, వాడి పొగ‌రు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌, వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్నెం ముద్దు బిడ్డ‌, నా త‌మ్ముడు గోండ్రు బెబ్బులి కొమురం భీం అంటూ ఎన్టీఆర్ పాత్రను ప‌రిచ‌యం చేశారు. నిజంగానే ఎన్టీఆర్ ను చూస్తుంటే గర్జించే సింహంలాగనే వున్నాడు. మరి ఈ వీడియో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

 

నేను పూర్తిగా కోలుకున్నా – మీ అందరి వల్లే సాధ్యమైంది

సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆయనకు ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ నేపథ్యంలో గతకొద్ది కాలంగా చికిత్స తీసుకుంటున్నారు కూడా. ఇక క్యాన్సర్ పై సంజూ భాయ్ విజయం సాధించినట్టే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 

 

View this post on Instagram

 

My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

‘ఎఫ్ 2’ కు జాతీయ అవార్డ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. గత ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా మరో అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. 51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుక‌ల్లో భాగంగా .. ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరిలో ఎఫ్2కు జాతీయ అవార్డు ల‌భించింది. అంతేకాదు ఈ అవార్డు సాధించిన ఏకైన తెలుగు సినిమాగా ఎఫ్2 నిల‌వ‌డం గొప్ప విషయం.

 

‘రాధే శ్యామ్’ – ‘విక్రమాధిత్య’ గా ప్రభాస్

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటుంది. ఇక రాధే శ్యామ్ నుండి సర్ ప్రయిజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని తెలుపుతూ ఆ సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ నవ్వుతూ కనపడుతున్నాడు.

 

‘తిమ్మరుసు’ అఫీషియల్ గా లాంచ్

ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రకటన చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి. ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టారు.

 

‘రాధేశ్యామ్’ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ‘జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్’

“రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ప‌లు హిట్ చిత్రాల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

నిఖిల్ ’18 పేజెస్’ షూటింగ్ మొద‌లు

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. క‌రోనా వ‌ల‌న షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేష‌న్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

 

ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ ఫస్ట్‌లుక్ రిలీజ్

ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ థిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రానికి రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

‘ముత్తయ్య మురళీధరన్ ‘ బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. అంతే కాదు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ సేతుపతిని చూసి అచ్ఛం అలానే ఉన్నాడన్న ప్రశంసలు కూడా దక్కాయి. అయితే మరోపక్క ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్లో నటించవద్దంటూ నిరసనలు కూడా వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీలంక మతవాదనకు మద్దతు పలికిన మురళీధరన్‌ నమ్మకద్రోహి అని కాబట్టి అతని బయోపిక్‌లో నటించవద్దంటూ పలు తమిళ సంఘాలు…భారతీరాజాతో సహా పలువురు కోలీవుడ్ ప్రముఖులు కోరారు. దీనితో ఫైనల్ గా విజయ్ ఈ బయోపిక్ నుండి తప్పుకున్నట్టు తెలిపారు. ఇక ముత్తయ్య మురళీధర్ కూడా సినిమా నుండి తప్పుకోమని చెప్పడంతో మొత్తానికి విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

 

‘నిత్యా’ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

ముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరు ‘నిన్నిలా నిన్నిలా’. ప్రముఖ తమిళ నటుడు, ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

‘మ‌హాస‌ముద్రం’లో అను ఇమ్మాన్యుయేల్‌

అజయ్ భూపతి దర్శకత్వంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘మ‌హాస‌ముద్రం’. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.

రవితేజ ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ రిలీజ్

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ను పెట్టనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ఖిలాడి’ (ప్లే స్మార్ట్‌) అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.

 

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రీ టీజర్ రిలీజ్

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్‌ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 4 =