తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తనఅందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాశీఖన్నా మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ “తుగ్లక్ దర్బార్ ” తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారని చిత్ర నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. హీరో విజయ్ సేతుపతి , రాశీఖన్నా జంటగా “సంగ తమిళన్ “(విజయ్ సేతుపతి )తమిళ మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
వారిద్దరూ ఇప్పుడు “తుగ్లక్ దర్బార్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “తుగ్లక్ దర్బార్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనను “తుగ్లక్ దర్బార్ ” మూవీ లో హీరోయిన్ గా ఎంపిక చేసినందుకు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టార్ విజయ్ సేతుపతి తో మరో సారి నటించే అవకాశం ఇచ్చినందుకు రాశీఖన్నా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























