బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ వెర్షన్స్ కి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























