యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా, అభిమానులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
27వ తేదీన కుప్పంలో జరిగిన సంఘటన తనను బాధించిందనీ.. తారకరత్నపై తాత గారి ఆశీర్వాదం, అభిమానుల ఆశీర్వాదం ఉందనీ.. ఇప్పడిప్పుడే తారకరత్న కోలుకుంటున్నారనీ.. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని మనమంతా కోరుకుందామనీ.. ప్రస్తుతం తారకరత్న స్టేబుల్ గా ఉన్నారనీ.. తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గా లేదని మాత్రం చెప్పలేమనీ.. మా తారకరత్న అన్నకి మేమున్నామనీ.. కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ గారి సహకారానికి థ్యాంక్స్ అని ఎన్టీఆర్ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: