మైఖేల్ కోసం న్యాచురల్ స్టార్

Natural Star Nani to Grace Sundeep Kishan Michael Movie Pre Release Event,Sundeep Kishan’s Michael Pre-Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sundeep Kishan,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Movie Updates,Michael Telugu Movie Latest News,Michael Pre-Release Event Details,Michael Movie Pre-Release Event Details,Michael Telugu Movie Pre-Release Event Details

రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈసినిమాతో సందీప్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. దీనికోసం డేట్ ను వేదికను ఫిక్స్ చేశారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అంటే జనవరి 31వ తేదీన హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ మాల్ లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ ఎవరో ప్రకటించారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని అతిథిగా రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.