అమిగోస్ మూవీ గురించి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ముచ్చట్లు

Ashika Ranganath about Amigos Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest News,Kalyan Ram,Nandamuri Kalyan Ram,Ashika Ranganath Comments On Amigos Movie,Ashika Ranganath Sensational Comments On Amigos Telugu Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 17, 2023 న రిలీజ్‌ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేసింది. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రేజీ బాయ్ (2016) మూవీతో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఆషికా రంగనాథ్ పలు కన్నడ మూవీస్ లో తన అందం, అభినయంతో కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ తో ఆషిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అమిగోస్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో తన కెరీర్ గురించి, అమిగోస్ మూవీ గురించి ఆషిక ముచ్చటించారు. ఆషిక మాట్లాడుతూ .. డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డిగారు చెప్పిన క‌థ‌ను ఫోన్‌లోనే విన్నాననీ.. సినిమాలో హీరో మూడు పాత్ర‌లు చేయ‌టం.. తన పాత్ర‌ను మ‌లిచిన తీరు అన్ని న‌చ్చ‌డంతో సినిమాకు ఓకే చెప్పేశాననీ.. చిన్న‌ప్పట్నుంచి తెలుగు సినిమాలు, పాట‌లు వినేదాన్ననీ దాని వ‌ల్ల తెలుగు అర్థ‌మ‌య్యేదనీ తెలిపింది. ఇప్పుడు వ‌ర్క్ చేస్తున్నాననీ.. దాని వ‌ల్ల తెలుగు నేర్చుకోవ‌టానికి అవ‌కాశం వ‌చ్చిందనీ.. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాననీ.. సినిమాలో డైలాగులు చెప్పడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నాననీ.. టాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌కి వ‌ర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్ద‌గా తేడా లేదనీ.. భాష మాత్ర‌మే వ్య‌త్యాసం అనీ పేర్కోన్నారు. అయితే తెలుగులో మాత్రం ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేస్తారనీ.. మంచి ప్లానింగ్‌తో ముందుకెళ‌తారనీ..తెలుగులో ఇత‌ర సినిమాల్లో న‌టించ‌మ‌ని అవ‌కాశాలు వ‌స్తున్నాయనీ.. అమిగోస్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాననీ.. దీని త‌ర్వాత మంచి పాత్ర‌ల‌నిపించిన సినిమాల్లో న‌టిస్తాననీ.. తెలుగు ఆడియెన్స్ గొప్ప మ‌న‌సున్నవారనీ.. ఇక్కడ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులు చాలా మందిని తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఆదరిస్తున్నారనీ.. తనను కూడా అలాగే ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఎదురు చూస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =