శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి పాటలు, పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. హిందీలో ఈ టీజర్ ను షాహిద్ కపూర్, తమిళ్ లో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకంటుంది. నాని ఫుల్ మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: