మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో కనిపించనున్నాడట. ఇంకా పొడవాటి గడ్డంతో మరో లుక్ లో కనిపించనున్నాడట. ఇక మూడో లుక్ సీక్రెట్ గా ఉంచుతున్నారట మేకర్స్. ఈ లుక్ సినీ లవర్స్ కు ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను కూడా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1970 కాలంలో ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. అప్పట్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: