
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 9


'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ డేట్ కన్ఫామ్

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

హైదరాబాద్ లో "పుష్ప " షూటింగ్

సమంత నా రోల్ మోడల్ - ఐశ్వర్య రాజేష్

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్

పాత్ర ప్రాధాన్యతనే చూస్తా - ఐశ్వర్య రాజేష్

'భీమ్లా నాయక్' రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్

'రాకెట్రీ' రిలీజ్ పై మాధవన్ క్లారిటీ

ప్రతీ రోజును సవాల్ గా తీసుకోవాలి- తాప్సీ

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'కొండ పొలం' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'

'భీమ్లా నాయక్'.. రానా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ "హరిహర వీరమల్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు " మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ డేట్ కన్ఫామ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ముందు ఈసినిమాను ఒక పార్ట్ మాత్రమే అనుకోగా ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారు.

'జై భీమ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య జై భీమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నాడు.

సాయితేజ్ 'రిపబ్లిక్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాలు అంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయి.. ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు మీద ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రం ఈసినిమా కచ్చితంగా నచ్చుతుంది.

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

హైదరాబాద్ లో "పుష్ప " షూటింగ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్…

సమంత నా రోల్ మోడల్ - ఐశ్వర్య రాజేష్
"రాంబంటు "మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , "నీదానా అవన్"మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య "కౌసల్య కృష్ణమూర్తి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "వరల్డ్ ఫేమస్ లవర్ ", "టక్ జగదీష్ "మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య కథానాయికగా రూపొందిన "రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 వ తేది రిలీజ్ కానుంది. ఐశ్వర్య ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.

పాత్ర ప్రాధాన్యతనే చూస్తా - ఐశ్వర్య రాజేష్
జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , "వరల్డ్ ఫేమస్ లవర్", "టక్ జగదీష్" మూవీస్ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి."రిపబ్లిక్ " మూవీ విడుదల సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మీడియా తో సమావేశమయ్యారు.

'భీమ్లా నాయక్' రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా మలయాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది.

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.

'రాకెట్రీ' రిలీజ్ పై మాధవన్ క్లారిటీ
తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఇక ఇటీవలే తెలుగులో విలన్ పాత్రలు కూడా పోషించాడు. ఇక ఇదిలా ఉండగా మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ సినిమాను మాధవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఎంతో ఇంట్రెస్ట్ తో ఈసినిమాను రూపొందించాడు మాధవన్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ట్రైలర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ సినిమా రిలీజ్ మాత్రం ఇంతవరకూ అవ్వలేదు. ప్రస్తుతం 50 శాతం ఆక్యూపెన్నీతో కాస్త థియేటర్లు తెరుచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్…

ఓటీటీలో 'రాజ రాజ చోర'.. రిలీజ్ డేట్ ఫిక్స్
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

ప్రతీ రోజును సవాల్ గా తీసుకోవాలి- తాప్సీ
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నిర్మిస్తున్నారు.

'లవ్ స్టోరీ' రివ్యూ.. ఎమోషనల్ గా సాగే ప్రేమకథ
ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే సినిమా రిలీజ్ కు కాస్త లేట్ అయినా కూడా కరెక్ట్ టైమ్ లో వచ్చింది. ఎమోషనల్ గా అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచగా దానికితోడు మహేష్ బాబు లాంటి హీరోలు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

'కొండ పొలం' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు
క్రిష్-వైష్ణవ్ తేజ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ను, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘ఓబులమ్మ’ పాటని లేటెస్ట్‌గా విడుదల చేయగా దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా.

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించారు కూడా. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అయింది. ఇక ఇక్కడే కొన్నిరోజులు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తాజాగా ఊటీకి వెళ్లింది. అక్కడ ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఆ షెడ్యూల్ కొనసాగే అవకాశం…

విశాల్ 'ఎనిమి' డబ్బింగ్.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.

'భీమ్లా నాయక్'.. రానా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న మల్టీసారర్ సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా మలయాళ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఒక్క పవన్ ఇంట్రడక్షన్ వీడియోతో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియోలో రానా పేరు తప్ప రానాను చూపించలేదు. ఇక ఇప్పుడు రానా టైం వచ్చేసింది. చెప్పినట్టే రానా ఇంట్రడక్షన్ వీడియోను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక డానియేల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానా ఇంట్రడక్షన్…