పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న మల్టీసారర్ సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా మలయాళ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఒక్క పవన్ ఇంట్రడక్షన్ వీడియోతో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియోలో రానా పేరు తప్ప రానాను చూపించలేదు. ఇక ఇప్పుడు రానా టైం వచ్చేసింది. చెప్పినట్టే రానా ఇంట్రడక్షన్ వీడియోను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక డానియేల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానా ఇంట్రడక్షన్ వీడియో కూడా అదే రేంజ్ లో ఉంది. వీడియో చూస్తుంటే ఈ పాత్రకు రానాను కరెక్ట్ గా ఎంపిక చేశారనిపిస్తుంది. నెగెటివ్ షేడ్ లో రానా ఎలా చేస్తాడో తెలుసు. ఇక ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting @RanaDaggubati as Daniel Shekar🔥
▶️ https://t.co/kB2FxFjfXS#BheemlaNayak @PawanKalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @SitharaEnts @adityamusic pic.twitter.com/yxMirG90GB
— Puneeth Rajkumar (@PuneethRajkumar) September 20, 2021
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్ నటిస్తుంది. ఇక రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుందని అనుకుంటుండగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తప్పుకుందని ఆ ప్లేస్ లో సంయుక్త మీనన్ అనే మరో హీరోయిన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈసినిమాలో సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: