మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు చిరు బాబితో అలాగే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయనున్నాడు. నిజానికి లూసిఫర్ సినిమా పూర్తియిన తరువాతే చిరు మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు. అది కూడా ముందు బాబి సినిమా మొదలవుతుందనుకున్నారు. కానీ అనుకోకుండా ఇప్పుడు మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమా స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా గాడ్ ఫాదర్ షూటింగ్ దశలో ఉండగానే. ఊటీ షెడ్యూల్ తరువాత గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఇంకా లోకషన్లు ఫైనల్ అవ్వలేదట. మరోవైపు మెహర్ రమేష్ మాత్రం ముందుగానే లోకేషన్లు కూడా ఫిక్స్ చేశాడట. దీంతో ఈ గ్యాప్ లో భోళా శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం దీనిపైన ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో..
కాాగా ఈసినిమాలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే కదా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: