చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించారు కూడా. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అయింది. ఇక ఇక్కడే కొన్నిరోజులు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తాజాగా ఊటీకి వెళ్లింది. అక్కడ ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఆ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సత్యదేవ్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అయితే వీటిపై మేకర్స్ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. కాగా రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇదిలా ఉండగా చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. వీటితో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: