సాయి తేజ్, దేవ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టీజర ట్రైలర్ తో ఈసినిమాపై భారీ అంచనాలు పెరగగా.. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అయిందో లేదో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటులు:సాయితేజ్, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన
దర్శకుడు: దేవ కట్టా
బ్యానర్: జేబీ ఎంటర్‌టైన్మెంట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ:సుకుమార్
కథ..
డిప్యూటీ కలెక్టర్ దశరథ్(జగపతిబాబు) కొడుకు పంజా అభిరాం(సాయితేజ్). చిన్నప్పటి నుండి చదువులో ముందుండే అభిరాం ఎం.ఎస్ చదువుకుని అమెరికా వెళ్లాలనుకుంటాడు. మరోవైపు తెల్లేరులో గుణ అనే రౌడీ అరాచకాలు మీతిమీరుతుంటాయి. అతనికి మంత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) సపోర్ట్ ఉంటుంది. తన ఓటు రిగ్గింగ్ చేశారని అభి పోలింగ్ బూత్‌లో గొడవపడడంతో గుణ మనుషుల కంట్లో పడతాడు. అలా పలు సందర్భాల్లో అభి,మణి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అనేక మలుపుల తర్వాత తన సొంత గ్రామం తెల్లేరుకి కలెక్టర్‌గా ఎంపికవుతాడు అభిరామ్. విశాఖ వాణికి రైట్ హ్యాండ్‌లాంటి రౌడీషీటర్ గుణ(బాక్సర్ దిన)ను ఎన్‌కౌంటర్ చేయిస్తాడు. ఇదిలా ఉండా విశాఖ వాణికి చెందిన చేపల పరిశ్రమ కారణంగా మంచి నీటి సరస్సు అయిన తల్లేరు కాలుష్యమవుతుంటుంది. దీనివల్ల అక్కడున్న జనాలకు కూడా పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీనిపై రీసెర్చ్ చేసిన ఎన్నారై కనిపించకుండా పోతాడు. అతని చెల్లెలు మైరా(ఐశ్వర్యా రాజేశ్)తో అభిరాంకు పరిచయం ఏర్పడుతుంది. ఇక విశాఖ వాణి చేపల పరిశ్రమ కారణంగా, కబ్జాకు గురై ఆత్మహత్యులు చేసుకుంటున్న రైతుల సమస్యతో పాటు కాలుష్యమవుతున్న తల్లేరు మంచి నీటి సరస్సుకు వచ్చిన సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. ఈ క్రమంలో అభిరాం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు. చివరకు విశాఖవాణిపై అభిరాం విజయం సాధించాడా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
దేవకట్టా అంటే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ప్రస్థానం. ఈసినిమాను తను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు రిపబ్లిక్ సినిమాలో కూడా అదే చూపించాడు. రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రాట్ సిస్టమ్, న్యాయవ్యవస్థ ఎలా ఉండాలి. ఈ మూడు వ్యవస్థలు ఏది ఒకటి గాడి తప్పినా సమాజం ఎలా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ దేవ కట్టా ఈసినిమాను తెరకెక్కించాడు. నిజానికి ఇలాంటి కథలను అర్థం చేసుకోవాలంటే కాస్త ఆలోచించాల్సిందే. చదువుకున్నవాళ్లకైతే కాస్త అర్థవుతుంది కానీ చదువుకోని వాళ్లకు మాత్రం కష్టమే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ప్రభుత్వ విధివిధానాలు ఎలా ఉన్నాయి.. ప్రభుత్వానికి రాజకీయాలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి.. రాజీకయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అదే విషయాన్ని దేవకట్టా సినిమా ద్వారా చూపించాడు. తెల్లేరు ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలు క్షుణ్ణంగా పరిశీలించి, దాని మీద రీసెర్చ్ చేసి మంచి కథ రాసుకున్నారు. దానికి ఎమోషన్‌ని యాడ్ చేసి అంతే చక్కగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక ఈసినిమాలో హీరోగా చేసిన సాయితేజ్ కు ఇది నిజంగా డిఫరెంట్ పాత్ర అని చెప్పొచ్చు. తను ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో హీరోస్ ఎలా చేసినా వర్కవుట్ అవుతుంది.. కానీ ఒక బాధ్యతాయుతమైన రోల్ చేస్తున్నప్పుడు మాత్రం దానికి తగినట్టు సెటిల్డ్ గా నటించడం అంటే అంత ఈజీ కాదు. ఒక యాక్టర్ కు ఇది ఛాలెంజింగ్ రోలే. సాయి తేజ్ కూడా ఈసినిమాను ఒప్పుకున్నాడంటేనే తను ఈ ఛాలెంజింగ్ రోల్ చేయడానికి రెడీ అయిపోయాడని అర్థమవుతుంది ఈసినిమాలో తన నటన చూస్తుంటే. ఎమోషనల్ సీన్స్‌లో హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య రాజేష్ నటనకు ఆస్కారమున్న రోల్‌లో ది బెస్ట్ ఇచ్చింది. ఇక రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. సినిమాకు వెన్నముకలాంటి విశాఖ వాణి పాత్రను ఆమె తప్ప మరెవరూ చెయ్యలేరనిపించేలా చేశారు. ఇక జగపతి బాబు క్యారెక్టర్ కూడా సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి.. మిగతా నటీనటులంతా తమ క్యారెక్టర్ల మేర చక్కగా నటించి మెప్పించారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే పాటలు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ బావుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాలు అంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయి.. ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు మీద ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రం ఈసినిమా కచ్చితంగా నచ్చుతుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: