శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ‘. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచగా దానికితోడు మహేష్ బాబు లాంటి హీరోలు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ చైతన్య
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పుడు తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకంటూ రొటీన్ గా కాకుండా కాస్త విభిన్నంగా ఉండే పాత్రలే ఎంచుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే లవ్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు.
సాయి పల్లవి
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలను చూసి చెప్పొచ్చు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆసినిమాతో పలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. అంతేకాదు పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలను ఎంచుకుంటుంది. ఇక ఈసినిమాకు ఉన్న హైలెట్స్ లో సాయి పల్లవి కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమాకు ఇంత బజ్ రావడంలో సాయి పల్లవి పాత్ర కూడా ఉంది.
శేఖర్ కమ్ముల
సెన్సిబుల్ సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఎలాంటి హడావుడి లేకుండా కూల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. తాను ఇప్పటివరకూ తీసిన సినిమాలను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్,లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,అనామిక, ఫిదా ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శేఖర్ కమ్ముల నుండి ఈసారి ఇంటెన్స్ లవ్ స్టోరీ వస్తుండటంతో సినిమాపై అందరి ఆసక్తి పెరిగింది.
కాంబినేషన్
శేఖర్ కమ్ముల-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా సంచలన విజయం సాధించింది. తెలంగాణ యాసలో భానుమతిగా తన నటనతో, నర్తనతో అందరినీ ఫిదా చేసేసింది. తొలి తెలుగు సినిమాతోనే స్టార్‌డమ్ చూడడమే కాకుండా… `ఉత్తమ నటి`గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో లవ్ స్టోరీ వస్తుండటంతో ఈసినిమా పై కూడా అంచనాలు ఉన్నాయి.
థియేటర్ రిలీజ్
కరోనా సెకండ్ వేవ్ తరువాత పలు సినిమాలు రిలీజ్ అవ్వగా చాలా సినిమాలు సో సో గానే ఆడాయి. ఇటీవల రిలీజ్ అయిన సీటీమార్ సినిమా కూడా మంచి టాక్ ను తెచ్చుకుంది అయితే మొదటి మూడు రోజులు ప్రేక్షకులు థియేటర్ కు రాగా ఆ తరువాత తగ్గుముఖం పట్టారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసమే ఎదురుచూస్తుంది. ఈ సినిమా రెస్పాన్స్, కలెక్షన్స్ బట్టే నెక్స్ట్ సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: