మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు ” మూవీ
2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హరిహర వీరమల్లు ” మూవీ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ అప్డేట్ ఇచ్చారు. ఓ సీన్ చిత్రీకరిస్తే ఇంటర్వెల్ వరకు సినిమా పూర్తవుతుందనీ , తదుపరి షెడ్యూల్‌ను నవంబర్ నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నామనీ చెప్పారు. హీరో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన “కొండపొలం ” అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: