తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఇక ఇటీవలే తెలుగులో విలన్ పాత్రలు కూడా పోషించాడు. ఇక ఇదిలా ఉండగా మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ సినిమాను మాధవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఎంతో ఇంట్రెస్ట్ తో ఈసినిమాను రూపొందించాడు మాధవన్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ట్రైలర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ సినిమా రిలీజ్ మాత్రం ఇంతవరకూ అవ్వలేదు. ప్రస్తుతం 50 శాతం ఆక్యూపెన్నీతో కాస్త థియేటర్లు తెరుచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయకపోవడంతో దాదాపు అందరూ ఈసినిమా గురించి కూడా మర్చిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మాధవన్ చాలా రోజుల ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ‘రాకెట్రీ’ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని, ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టమని తెలిపాడు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్న తరువాతే ఈసినిమాను రిలీజ్ చేయగలమని.. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకోనపుడు సినిమాను ఎలా రిలీజ్ చేయగలమని అంటున్నారు. మొత్తానికి థియేటర్లు పూర్తి స్థాయిలో రిలీజ్ అయినప్పుడే సినిమాను రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు మాధవన్.
కాగా ఈసినిమాలో మాధవన్ నటించడమే కాదు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూాడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: