నాగచైతన్య– సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ లవ్ స్టోరీ. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక నేడు ఈసినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నాగ చైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీ రావు, ఉత్తేజ్
డైరెక్టర్.. శేఖర్ కమ్ముల
బ్యానర్.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్
నిర్మాతలు.. నారాయణ్ దాస్ కే. నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావ్
సంగీతం.. పవన్
సినిమాటోగ్రాఫర్.. విజయ్ సి. కుమార్
కథ
రేవంత్ (నాగ చైతన్య), మౌనిక (సాయి పల్లవి) ఇద్దరూ ఆర్మూర్ కు చెందిన వారు. అయితే ఇద్దరూ కెరీర్ లో సెటిల్ అవ్వడానికి హైదరాబాద్ వస్తారు. అయితే వారి ప్రయత్నాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమలో పడటం.. కులాలు వేరని ఇంట్లో ఇబ్బందులు.. వారు ఎదురుకున్న కష్టాలు.. చివరికి ఎలా ఒకటయ్యారు అన్నదే ఈ లవ్ స్టోరీ సినిమా.
విశ్లేషణ..
కుల వివక్షత నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రేమకథలు వచ్చాయి. ఇప్పటికీ ఎన్నో వందల సినిమాలు వచ్చి ఉంటాయి. అయితే కథను ఎంత కొత్తగా చూపిస్తున్నాం.. ప్రేక్షకులను ఎంత కనెక్ట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. శేఖర్ కమ్ముల ఆవిషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న కులాల ఆధిపత్యం, లవ్ స్టోరీని దర్శకుడు పర్ ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేశాడు. అందులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో చూస్తూనే ఉంటాం. దాన్నేశేఖర్ కమ్ముల చాలాబాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ ను ప్రేమ, కాస్త వినోదాత్మకంగా తీసినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా సాగిపోతుంది.
ఇక ఈసినిమాకు ప్రధాన బలం ఏదైనా ఉందంటే అది డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో హీరోయిన్స్ గా నాగ చైతన్య-సాయి పల్లవి చేయడమే. ఈ కాంబినేషన్ పై మొదటి నుండి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా నటించారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో సూపర్ గా వర్కవుట్ అవుతుంది. వీరిద్దరు పాత్రల్లో జీవించినట్లుగా కనిపిస్తుంది. పేరుకు లవ్ స్టోరీయే అయినా మాములు లవ్ సినిమాలకు, ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ప్రేమతో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా ఇద్దరూ పోటాపోటీగా చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. యూత్ మాత్రమే కాదు పెద్ద వాళ్లకు కూడా ఈసినిమా కనెక్ట్ అవుతుంది.
ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే సినిమా రిలీజ్ కు కాస్త లేట్ అయినా కూడా కరెక్ట్ టైమ్ లో వచ్చింది. ఎమోషనల్ గా అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: