రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరి క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజకు ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: