
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 7


"బంగార్రాజు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్

'ఆది పురుష్' ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్..!

'భీమ్లానాయక్' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు

రాజమండ్రి లో "ఆడవాళ్ళు మీకు జోహార్లు" షూటింగ్

ఫైనల్ స్టేజ్ లో అడివి శేష్ 'మేజర్'

ఫైనల్ షూట్ కోసం సిద్దమవుతున్న 'మేజర్'

'సమ్మతమే' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం

త్వరలో సెట్స్ కు "భోళా శంకర్"

సంక్రాంతి బరిలో "బంగార్రాజు "

ఆది పురుష్ పక్కా ప్లాన్ తో వెళుతున్న ఓం రౌత్..!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఆదిపురుష్'. ఇక ఈసినిమా షూటింగ్ దగ్గర నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకూ ఓం రౌత్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే చాలా స్పీడ్ గా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. నిజానికి ఈసినిమా కరోనా టైమ్ లోనే సెట్స్ పైకి వెళ్లింది. ఆదిలోనే ఎన్నో ఇబ్బందులు వచ్చినా.. షూటింగ్ కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ ను జరిపాడు.

"బంగార్రాజు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే రీసెంట్ గా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ పూర్తవ్వనుంది. దీంతో సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దాని కోసం మంచి డేట్ ను చూస్తున్నారట మేకర్స్.

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "వేదాళం"తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

'సర్కారు వారి పాట' బ్లాస్టర్ ఖాతాలో మరో రికార్డ్
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఇప్పటికీ ఈ బ్లాస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసిన ఈ బ్లాస్టర్ తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది…

స్పెయిన్ లో "సర్కారు వారి పాట" సాంగ్ కంప్లీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'గల్లీ రౌడీ'..!
కరోనా వల్ల ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే చాలా కష్టంగా ఉంటే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో అలరించిన సందీప్ కిషన్ ఇటీవల గల్లీ రౌడీతో సందడి చేశాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి రానుంది. నవంబర్ 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

'ఆది పురుష్' ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్..!
సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తానికి ఒక సినిమా తర్వాత మరొక సినిమా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. వచ్చే ఏదాది సంక్రాతికి సందడి చేయనుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఇంట్రడక్షన్ వీడియో ఏ రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం. దీంతో ఈసినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది.

'భీమ్లానాయక్' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు
ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఈ ఏడాది కాస్త నిరాశే ఎదురైంది సినీ లవర్స్ కు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు రానున్న సంగతి తెలిసిందే కదా. అవి కూడా పెద్ద పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద సినిమాలే పోటీకి దిగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లానాయక్ ఇంకా పలు సినిమాలే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో సంక్రాంతికి ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద వార్ నడుస్తుందని.. తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానేఉన్నా వీటిలో ఎన్ని సినిమాలు ఫైనల్ గా…

దీపావళికి ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్'
కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆగస్ట్ 27న విడుదలైన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి ప్రశంసలు కురిపించారు కూడా.

రాజమండ్రి లో "ఆడవాళ్ళు మీకు జోహార్లు" షూటింగ్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పండుగ సందర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"సర్కారు వారి పాట "సెట్స్ లో థమన్ ఎస్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దుబాయ్ , హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫైనల్ స్టేజ్ లో అడివి శేష్ 'మేజర్'
తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ప్రస్తుతం శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీస్టార్ట్ చేయగా.. ఇటీవల అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే అడివి శేష్ కోలుకున్నాడు. దీంతో మేజర్ షూట్ ను తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో అజివి శేష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఈ…

ఫైనల్ షూట్ కోసం సిద్దమవుతున్న 'మేజర్'
మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. దానికితోడు ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో ఇంకా లేట్ అయింది. ప్రస్తుతం అడివిశేష్ కోలుకున్నాడు.

'సర్కారు వారి పాట' మీ స్పీకర్లు బద్దలవ్వడం ఖాయం
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లోని బర్సిలోనాలో జరుగుతోంది. మహేష్, కీర్తి సురేష్ పై సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి థమన్ తన ట్విట్టర్ ద్వారా ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ట్రాక్ మీ స్పీకర్లను బద్దలుకొట్టడం ఖాయం అంటూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్యూన్ ను కూడా పోస్ట్ చేశాడు. మరి నిజంగానే ఆ ట్యూన్ వింటుంటే ఖచ్చితంగా ఆకట్టుకునేలానే ఉంది.

'సమ్మతమే' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. రాజావారు రాణి గారు” ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో సమ్మతమే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

త్వరలో సెట్స్ కు "భోళా శంకర్"
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన "ఆచార్య " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ "లూసిఫర్" మలయాళ మూవీ రీమేక్ "గాడ్ ఫాదర్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ "వేదాళం" తమిళ మూవీ తెలుగు రీమేక్ "భోళా శంకర్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంక్రాంతి బరిలో "బంగార్రాజు "
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.