ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “భోళా శంకర్ “మూవీ పూజా కార్యక్రమాలను 11-11-2021 తేదీన ఉదయం గం.7:45నిలకు నిర్వహించబోతున్నట్టు, రెగ్యులర్ షూటింగ్‌ను 15-11-2021 తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: