సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్పెయిన్ లో మొదట టాకీ పార్ట్ షూట్ చేసిన దర్శకుడు పరశురామ్ ఒక సాంగ్ చిత్రీకరిస్తున్నారు. స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో అంతకు మించి అందమైన ఇంగ్లీష్ ముద్దుగుమ్మల నడుమ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబోలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. సాంగ్ చిత్రీకరణ పూర్తి అయ్యిందంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. స్పెయిన్ షెడ్యూల్ ను ఈ పాటతో ముగించబోతున్నారా లేదా ఇంకా టాకీ పార్ట్ ఏమైనా బ్యాలన్స్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.మహేష్ బాబు తాజా పాటలో ఇంగ్లీష్ ముద్దుగుమ్మల మద్యలో వారి కలర్ కు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉన్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: