యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల షూటింగ్ ను మొదలుపెట్టి.. నవంబర్ రెండవ వారంకు సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ కు సిద్దం చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇంకా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ2 సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో.. సుదీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: