తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ప్రస్తుతం శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీస్టార్ట్ చేయగా.. ఇటీవల అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే అడివి శేష్ కోలుకున్నాడు. దీంతో మేజర్ షూట్ ను తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో అజివి శేష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఈ షెడ్యూల్ తో మేజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
My journey being #MajorSandeepUnnikrishnan is almost finished. After this schedule, I shall go back to being his admirer. A fan that understands him better. A fan that tried to find a piece of Major Sandeep within himself. #MajorTheFilm pic.twitter.com/QMQ7MvWpD0
— Adivi Sesh (@AdiviSesh) October 23, 2021
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈసినిమా విజయంతో అడివి శేష్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.