
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 17


'తిమ్మరుసు' మేకింగ్ వీడియో రిలీజ్

3 ఏళ్ల 'గూఢచారి' సీక్వెల్ అనౌన్స్ మెంట్ త్వరలో

హైదరాబాద్ లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్
కన్ఫామ్.. డిసెంబర్ లో 'పుష్ప' పార్ట్ 1

'విజయ రాఘవన్' ట్రైలర్ రిలీజ్

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'SR కళ్యాణమండపం'

'లక్ష్య' న్యూ పోస్టర్ రిలీజ్

'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్

'రవితేజ' సినిమాలో 'వేణు'

'రాధేశ్యామ్' ఫైనల్లీ ప్యాకప్

'SR కళ్యాణమండపం' ట్రైలర్ రిలీజ్

ఫిలిం ఇండస్ట్రీ ఓపెన్ యూనివర్సిటీ

'వివాహ భోజనంబు' ట్రైలర్ రిలీజ్
ఈమధ్య హీరోలు సినిమాల్లో నటించడమే కాదు సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి వారి సినిమాలను వారే నిర్మించుకుంటున్నారు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హీరోలు ఆ రూట్ లో వెళుతుండగా.. ఇప్పుడు యంగ్ హీరో కూడా ఆలిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒక పక్కసినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనిలో భాగంగానే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా వివాహ భోజనంబు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు…

"బంగార్రాజు "లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా…

'తిమ్మరుసు' మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొదటినుండి డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తిమ్మరుసు తో మరోసారి విభిన్నమైన కథతో వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోగా విడుదలైన మొదటి సినిమా తిమ్మరుసు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలో సత్యదేవ్ నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక రిలీజ్ అయిన దగ్గరనుండి ఈసినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్టు తెలుస్తుంది.

3 ఏళ్ల 'గూఢచారి' సీక్వెల్ అనౌన్స్ మెంట్ త్వరలో
అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ అందరికీ నచ్చింది. ఒక రకంగా ఈసినిమానే అడివి శేష్ ను హీరోగా నిలబెట్టింది. ఇక ఈసినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.

హైదరాబాద్ లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం. గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్
కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచాయి.
కన్ఫామ్.. డిసెంబర్ లో 'పుష్ప' పార్ట్ 1
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. పరిస్థితులు నార్మల్ గా ఉంటే ఈ ఆగష్ట్ 13న ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అన్నీ మారిపోయాయి. ఈ గ్యాప్ లోనే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. దీంతో పార్ట్ 1 ను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు…

'విజయ రాఘవన్' ట్రైలర్ రిలీజ్
విజయ్ ఆంటోని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే బిచ్చగాడు సినిమా తరువాత మాత్రం తెలుగులో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్
సక్సె ఫుల్ "విట్టిదండు "మరాఠి మూవీ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ "లవ్ సోనియా "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సూపర్ 30 ", "బాట్లా హౌస్ "మూవీస్ లో తన అభినయం తో మృణాల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. మృణాల్ కథానాయికగా రూపొందిన "తూఫాన్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "జెర్సీ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన మృణాల్ "ఆంఖ్ మిచోలి " మూవీ లో నటిస్తున్నారు. మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ కు కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'SR కళ్యాణమండపం'
రాజావారు రాణిగారు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 6న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈసినిమా.. ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

'లక్ష్య' న్యూ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల చాలా సార్లు బ్రేక్ పడింది. దాదాపు చివరి దశకు వచ్చిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ప్రతి శుక్రవారం అప్ డేట్ ఇస్తామని ఇటీవలే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.

సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం సుమంత్ యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ నుండి వస్తున్న అప్ డేట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. నిన్ననే ఈసినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పిన చిత్రయూనిట్ నేడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రాధేశ్యామ్ ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. 2022, జనవరి 14న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ ఆఫీస్ షూట్‌లో చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ గా నడిచి వస్తున్న స్టిల్ ఆకట్టుకుంటుంది.

'రవితేజ' సినిమాలో 'వేణు'
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈసినిమాలో మరో సీనియర్ హీరోను తీసుకుంటున్నట్టు అధికారింగా ప్రకటించారు చిత్రయూనిట్. ఆ హీరో ఎవరో కాదు వేణు తొట్టెంపూడి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వేణు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

'రాధేశ్యామ్' ఫైనల్లీ ప్యాకప్
మొత్తానికి రాధాకృష్ణ దర్శకత్వంలోప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నిజానికి సాహో తరువాత స్టార్ట్ అయిన ఈసినిమా దాదాపు సెట్స్ పైకి వచ్చి రెండేళ్లు అవుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కోరనా ఫస్ట్ వేవ్ వల్ల మొదట బ్రేక్ రాగా ఆ తరువాత అందులోనూ ఇటలీ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో చాలాకాలం పాటు షూటింగ్ పెండింగ్ పడింది. ఆతరువాత మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టగా ఇక మరి కొద్దిరోజుల్లో షూటింగ్ అయిపోతుంది అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ రాగా మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్…

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదల చేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

పవన్ పై రానా ప్రశంసలు.. చాలా విషయాలు నేర్చుకుంటున్నా
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మల్టీ స్టారర్ సినిమాలు వస్తుండగా అందులో పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాపై కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. పవర్ స్టార్ అంటేనే సూపర్ క్రేజ్ ఉంటుంది.. దానికితోడు రానా లాంటి టాలెంటెడ్ నడుట కూడా నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే షూటింగ్ ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దీంతో పవర్ స్టార్ క్రేజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

'SR కళ్యాణమండపం' ట్రైలర్ రిలీజ్
'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా 'SR కళ్యాణమండపం'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. దీనిలోభాగంగానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఫిలిం ఇండస్ట్రీ ఓపెన్ యూనివర్సిటీ
శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా హైద్రాబాద్ లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ.. తిమ్మరుసు గురించి చెప్పేదేముంది మరో విషయం చెప్పాలి.. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది ఓపెన్ యూనివర్సిటీ. ఎవరైనా సరే ప్యాషన్‌తో రావాలి.. కష్టపడి నిరూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్ రేట్ అన్నది చాలా తక్కువ. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్ అయిన ఎంతో మందిలో నాని అన్న ఒకరు. నాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి’’…