యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల చాలా సార్లు బ్రేక్ పడింది. దాదాపు చివరి దశకు వచ్చిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ప్రతి శుక్రవారం అప్ డేట్ ఇస్తామని ఇటీవలే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే ఈరోజు శుక్రవారం కావడంతో ఈసినిమా నుండి న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ రొమాంటిక్ పోస్టర్ లో కేతికా శర్మ హీరో నాగశౌర్య నుదిటిపై ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది.
Rarely you love like this. Witness @IamNagashaurya and #ketikasharma’s love soon💥#Lakshya
🏹#𝐋𝐚𝐤𝐬𝐡𝐲𝐚𝐬𝐅𝐫𝐢𝐝𝐚𝐲🏹@AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @IamJagguBhai @kaalabhairava7 pic.twitter.com/WIeOERVTeY
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) July 30, 2021
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: