రాజావారు రాణిగారు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 6న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈసినిమా.. ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Aug 6th ❤️#SRKalyanaMandapam pic.twitter.com/RMqmoiYxla
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 31, 2021
కాగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో సాయికుమార్ హీరో తండ్రిగా నటించారు. తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిరణ్ అబ్బవరం అందిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: