శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈసినిమాలో మరో సీనియర్ హీరోను తీసుకుంటున్నట్టు అధికారింగా ప్రకటించారు చిత్రయూనిట్. ఆ హీరో ఎవరో కాదు వేణు తొట్టెంపూడి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వేణు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #RamaRaoOnDuty takes privilege in welcoming back everyone’s favorite #VenuThottempudi garu to be ON DUTY again to flare the screen.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @sahisuresh @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/QYWRbdFNxy
— SLV Cinemas (@SLVCinemasOffl) July 29, 2021
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.
‘స్వయంవరం’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. ఇక ఆ తరువాత `హనుమాన్ జంక్షన్`, `అల్లరే అల్లరి`,`గోపి గోపిక గోదావరి`, ‘చెప్పవే చిరుగాలి’, ‘కళ్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరెళ్తే’, ‘ఖుషిఖుషిగా’ వంటి చిత్రాలతో తన కామెడీ నటనతో ఆకట్టుకున్నాడు వేణు. అయితే ఆ తరువాత సరైన విజయాలు లేక సినిమాలకు దూరమయ్యారు. 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన `దమ్ము` చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించాడు. 2013 తర్వాత ఆయన ఏ సినిమాలో కనిపించలేదు. ఇన్నాళ్లకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈసినిమా వేణుకు మంచి కమ్ బ్యాక్ అవుతుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: