
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 14


కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేసిన సత్యదేవ్

'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ ఖరారు

విశ్వక్ సేన్ "పాగల్ " ప్రమోషనల్ టూర్

బాక్సర్ గా చేయడం ఒక ఛాలెంజ్

"లూసిఫర్ " లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ ?

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్

"శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ కి ప్రభాస్ సపోర్ట్

లీకులపై మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'హౌస్ అరెస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్

గూఢచారిగా నిఖిల్

"భీమ్లా నాయక్ "ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్

"లక్ష్య "మూవీ గ్లింప్స్ రిలీజ్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేసిన సత్యదేవ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అటు తెలుగులోనే కాదు హిందీ లో కూడా అవకాాశాలను చేజిక్కించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం,‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలు షూటింగ్ కూాడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.

'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ ఖరారు
మొత్తానికి చైతు ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవిహీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. థియేటర్లు తెరిచిన వెంటనే ఈసినిమాను కూడా వెంటనే రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ మధ్యలో ఓటీటీ లో రిలీజ్ చేస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించకపోవడంతో నిజంగానే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఇన్ని రోజులకు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

విశ్వక్ సేన్ "పాగల్ " ప్రమోషనల్ టూర్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా “పాగల్ “మూవీ తెరకెక్కింది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. “పాగల్ “మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల , విమర్శకుల మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. “పాగల్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ సినిమా మామూలుగా ఉండదనీ , తన లెక్క తప్పైతే పేరు మార్చుకుంటాననీ సవాల్ చేయడంతో “పాగల్ “మూవీ మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది.

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు. ఆగష్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి.

బాక్సర్ గా చేయడం ఒక ఛాలెంజ్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఒకపక్క షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక దీపావళికి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

"లూసిఫర్ " లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ ?
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన "ఆచార్య "మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లో థమన్ రికార్డ్ చేశారు.

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.

"శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ కి ప్రభాస్ సపోర్ట్
70ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై "పలాస 1978" మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీ దేవి సోడా సెంటర్ " మూవీ ఆగస్ట్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. నరేష్ , రఘు బాబు , అజయ్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

లీకులపై మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం
పెద్ద సినిమాలకు లీకుల బెడద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేసే రాజమౌళి సినిమాలకే లీకులు తప్పట్లేదు. అలాంటిది వేరే సినిమాలకు ఇది కామన్. ఇక రీసెంట్ గా మరో రెండు పెద్ద సినిమాలు లీకుల బారిన పడ్డాయి. అవి సర్కారు వారి పాట, పుష్ప.

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం"మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'హౌస్ అరెస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్
90 ఎమ్ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి యర్నా దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘హౌజ్ అరెస్ట్’. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఇంట్లోకి దొంగతానికి వెళ్లిన కామెడీ గ్యాంగ్ ను పిల్లలు హౌజ్ అరెస్ట్ చేస్తారు. ఆతరువాత ఏం జరిగింది అన్నది కథ అని టీజర్ ను బట్టి ఇప్పటికే అర్థమైంది.

గూఢచారిగా నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ “, చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2 ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా బాధితులకు హీరో నిఖిల్ తన వంతు సాయం అందించారు. రీసెంట్ గా "18 "పేజెస్ "మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసిన హీరో నిఖిల్ స్పై- యాక్షన్ కథాంశంతో ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరో గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

"మాస్ట్రో " మూవీ న్యూ పోస్టర్ రిలీజ్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"లక్ష్య " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

"భీమ్లా నాయక్ "ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

'మళ్ళీ మొదలైంది' కన్ఫ్యూజన్ లో సుమంత్
ఈమధ్య ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ క్రియేటివిటీ బాగా వాడుతున్నారు. ఏరకంగా ప్రమోషన్స్ చేస్తే బజ్ వస్తుందో ఆ రకంగా ఆలోచిస్తూ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సుమంత్ చేస్తున్న సినిమాకు కూడా అదే రకంగా ఒక్కో క్యారెక్టర్ గురించి చెబుతూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ చేస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రీసెంట్ గా ఈసినిమాలో నటిస్తున్న పోసాని పోస్టర్ కూాడా రిలీజ్ చేశారు. పోసాని కుటుంబరావు గా నటిస్తుండగా...ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా ఉంటుందని…

'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈసినిమా కు సీక్వెల్ ను కూడా ఎప్పటినుండో తీస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా కూడా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది.

"లక్ష్య "మూవీ గ్లింప్స్ రిలీజ్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ప్రాచీన విలువిద్య నేపథ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

విశ్వక్ సేన్ 'పాగల్' రివ్యూ
ఓవరాల్ గా మథర్ సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది. యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది.