ఇప్పటి వరకూ కాస్త సీరియస్, మాస్ పాత్రలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నరేష్ కొప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా పాగల్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఏ రేంజ్ లో జరిగాయో.. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఎలా మాట్లాడాడో కూడా చూశాం. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విశ్వక్ సేన్ చెప్పినట్టు ఈసినిమా హిట్ అయిందా లేదా అన్నది చూడాలంటే మాత్రం రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటులు: విశ్వక్ సేన్,నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి,మేఘా లేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, మహేశ్, ఇంద్రజ
దర్శకుడు: నరేష్ కుప్పిలి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: రధన్
కథ:
ప్రేమ్(విశ్వక్ సేన్) చిన్నప్పుడే తన తల్లిని (భూమిక) కోల్పోతాడు. చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరమైన ప్రేమ్‌కి ఆ ప్రేమని పొందాలంటే అమ్మాయి వల్లే సాధ్యమని తన స్నేహితుడు సలహా ఇస్తాడు. అమ్మలా చూసుకునే అమ్మాయిని ప్రేమించమని చెబుతాడు. దీంతో అమ్మాయిలను ప్రేమలో పడేయడమే తన పనిగా పెట్టుకుంటాడు ప్రేమ్. ఇలా చాలా మంది అమ్మాయిలకు తన లవ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ అందరూ రిజెక్ట్ చేస్తారు. అంతేకాదు ఊహించని విధంగా రాజిరెడ్డి (మురళీ శర్మ కు ప్రపోజ్ చేస్తూ ట్విస్ట్ ఇస్తాడు. ఇక అలా చూసిన ప్రతి ఒక్కరికీ ప్రపోజ్ చేసే ప్రేమ చివరికి తీర(నివేదా పేతురాజ్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమెకి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అవుతుంది. మరి ఆమె ప్రేమను ప్రేమ్ ఎలా సంపాదించాడు.. అసలు రాజిరెడ్డి కి విశ్వక్ సేన్ ఎందుకు ప్రపోజ్ చేస్తాడు.. మరి తీర ప్రేమ్ ప్రపోజల్ ను ఒప్పుకుంటుందా..? తల్లి లాంటి ప్రేమను ప్రేమ్ పొందగలిగాడా అన్నది మిగిలిన కథ..
విశ్లేషణ..
ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మొదటి సినిమా నుండి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఫలక్ నుమా దాస్, HIT వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన విశ్వక్ సేన్ ఈసినిమాలో లవర్ బాయ్ లా కనిపించాడు. ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ పర్‌ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే విశ్వక్ సేన్ ఈ సినిమాలో విభిన్నంగా కనిపించాడని చెప్పుకోవాలి. నివేతా ఉన్న కొద్ది సేపే అయినా తనవంతుగా ఆకట్టుకుంది. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో అందంతో మాత్రమే కాక నటనతో కూడా చాలా బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ ఫర్వాలేదనిపించారుఇక మురళీశర్మ హీరోయిన్ డాడీగా మెప్పించారు. రాహుల్ రామకృష్ణ, నరేష్ తమ పాత్రల మేర నటించారు.
హీరో తల్లీ తండ్రులను కోల్పోవడం.. ఆ తరువాత అమ్మలాంటి ప్రేమ అందించే అమ్మాయికోసం హీరో చూడటం ఈనేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. మొదటి సినిమా అయినప్పటికీ నరేష్ తన నెరేషన్ తో బాగానే ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం మీద మిగతా అన్నిటికంటే ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ కోసం పరితపించే హీరో చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇంటర్వెల్ కు కాస్తంత ముందు ప్రేమ్ పొలిటీషియన్ రాజిరెడ్డి చుట్టూ ‘లవ్ యూ’ అంటూ తిరగడం ఆడియెన్స్ కు ఊహించని షాకే! దానికి పూర్తి భిన్నంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. ఓ చిన్న సస్పెన్స్ తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం, అది ప్రేమగా మారడం ఇదంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది.
ఇక లియోన్ జేమ్స్ అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. కెమెరామెన్ గా మణికందన్ మంచి విజువల్స్ అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు లక్కీ మీడియా అందించిన నిర్మాణ విలువలు సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి.
ఓవరాల్ గా మథర్ సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది. యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: