
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 15


పవన్ సినిమా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

షూటింగ్ పూర్తి చేసిన శకుంతల

మహేష్ బ్లాస్టర్ @ 31 మిలియన్స్

'సభకు నమస్కారం' గ్రాండ్ లాంఛ్

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ

విజయ్ దేవరకొండ "వర్క్ ఫ్రమ్ హోమ్ "

'శ్రీదేవి సోడా సెంటర్' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్

ఫైనల్ మిషన్ స్టార్ట్ చేసిన 'మేజర్'
కథా చర్చలలో "ఐకాన్ "

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'

మలయాళ మూవీ రీమేక్ లో అంజలి ?

కీర్తి సురేష్ ఫన్నీ ట్వీట్

లూసిఫర్ రీమేక్.. యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఫుల్ స్పీడుమీదున్నారు. అలా ఆచార్య అయిందో లేదో అప్పుడే మరో సినిమాను లైన్ లో కూడా పెట్టేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు హీరోగా లూసిఫర్ రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి ఫైనల్ గా షూటింగ్ ను షురూ చేశారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో నిర్మించిన భారీ సెట్‌పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.

గోవా షెడ్యూల్ లో 'సర్కారు వారి పాట'
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇక రీసెంట్‌గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బాస్టర్ తోనే మహేష్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి తీసుకెళ్లాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో నేడు తాజాగా ఈ సినిమా షూటింగ్ ను గోవాలో తిరిగి ప్రారంభించారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. గోవాలో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీరిస్తున్నారు. గోవా లోకేషన్‌లో రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ సీన్‌ను పిక్చరైజ్ చేస్తుండగా…

పవన్ సినిమా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
పవన్-రానా కాంబినేషన్ లో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈసినిమాలో పవన్ పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. భీమ్లా నాయక్ అంటూపవన్ కళ్యాణ్ పాత్ర పేరును రివీల్ చేసిన క్షణం నుంచి సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇటీవలే రిలీజ్ అయి ఎంత వైరల్ అయిందో చూశాం. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

'ఒరేయ్ బామ్మర్ది' రివ్యూ
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

షూటింగ్ పూర్తి చేసిన శకుంతల
సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ , గౌతమి , కబీర్ బేడీ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాను టైటిల్‌రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం” కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నాననీ , ఈ మూవీ…

మహేష్ బ్లాస్టర్ @ 31 మిలియన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాస్టర్ జోరు ఇంకా తగ్గలేదు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు 'సర్కారు వారి పాట' నుంచి బర్త్ డే కానుకగా బ్లాస్టర్ పేరిట ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇందులో మహేష్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించాడు డైరెక్టర్. అంతేకాదు మహేష్ డైలాగ్స్ కూడా అందరినీ అకట్టుకున్నాయి. అందుకే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన టీజర్‌గా నిలిచింది. ఇక విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా “సర్కారు వారి పాట” దూకుడు ఇంకా తగ్గనేలేదు. తాజాగా ఇప్పటి వరకు ఈ టీజర్ కు వచ్చిన…

'సభకు నమస్కారం' గ్రాండ్ లాంఛ్
ఇటీవలే నాంది లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించాడు అల్లరి నరేష్. ఈసినిమాలో తన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. “సభకు నమస్కారం” పేరుతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే ఒకటి రెండు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ
యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ "వర్క్ ఫ్రమ్ హోమ్ "
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్“మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కిక్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు.

'శ్రీదేవి సోడా సెంటర్' రిలీజ్ డేట్ ఫిక్స్
పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయినట్టు ఇప్పటికే అర్థమయిపోయింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన "పాగల్ "మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "పాగల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది.

ఫైనల్ మిషన్ స్టార్ట్ చేసిన 'మేజర్'
క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు ‘మేజర్’ అనే మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా.. కాశ్మిర్…

విక్రాంత్ రోణ.. ఇంట్రెస్టింగ్ గా బర్త్ డే పోస్టర్
వైవిధ్యమైన చిత్రాలలో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఇక అప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ రూపొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే షూట్ నూ పూర్తి చేసుకొని ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్టు 19న "విక్రాంత్ రోణ" ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథా చర్చలలో "ఐకాన్ "
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ "పుష్ప - ది రైజ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "పుష్ప - ది రైజ్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'స్టూవర్ట్‌పురం దొంగ’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయాడు. అది కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి రీమేక్ తోనే. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ను బాలీవుడ్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఈమధ్య ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది.

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ ప్రారంభం నుండి కాస్త డిఫరెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇటీవలే గాలిసంపత్ తో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. అందులో రాజ రాజ చోర సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక శ్రీవిష్ణు సినిమా అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

'సర్కారు వారి పాట' కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బ్లాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడే బ్లాస్టర్ తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన పుట్టిన సందర్భంగా సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూశాం కదా. ముఖ్యంగా ఇందులో మహేష్ మరింత యంగ్‌గా, స్టైలిష్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్ ను ఖుష్ చేశాడు. ఇదిలా ఉండదా ఇప్పుడు ఈవీడియో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ‘సర్కారు వారి పాట’ టీజర్ విడుదలైన 24 గంటల్లో ఈ బ్లాస్టర్ ప్రోమోకు 25.7 మిలియన్ వ్యూస్, 7లక్షల 54వేల లైక్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసి మహేశ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదని ఈ…

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఆసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేశాడు. ఈసినిమా షూటింగ్ అయితే పూర్త అయింది కూడా. ఇన్ని రోజులు థియేటర్లు లేవు కాబట్టి సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మలయాళ మూవీ రీమేక్ లో అంజలి ?
“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “గీతాంజలి “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ లో అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంజలి ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగురీమేక్ లో ఎంపిక అయినట్టు సమాచారం.

కీర్తి సురేష్ ఫన్నీ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ నోటీస్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు స్టైలిష్ న్యూ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని 24 గంటలలో 95.6 K లైక్స్ , 49.1 రీ ట్వీట్స్ తో టాలీవుడ్ లో న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసింది.