70ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై “పలాస 1978” మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన “శ్రీ దేవి సోడా సెంటర్ ” మూవీ ఆగస్ట్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. నరేష్ , రఘు బాబు , అజయ్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్రీ దేవి సోడా సెంటర్ ” మూవీ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీ యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసిన ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మూవీ ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ప్రభాస్ అన్నారు. “శ్రీ దేవి సోడా సెంటర్ ” మూవీ లో బోట్ యాక్షన్ సీన్ కై హీరో సుధీర్ బాబు బోట్ రైడింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ పొందారు. గోదావరి నది లో 84 బోట్స్ తో తెరకెక్కిన రిస్కీ యాక్షన్ సీన్ లో సుధీర్ బాబు డూప్ లేకుండా పాల్గొనడం విశేషం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























